ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (21:39 IST)

ముక్కుకు సర్జరీ చేయించుకునేందుకు రెడీ అయిన బుట్టబొమ్మ

Pooja Hegde
దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే కూడా సర్జరీకి సిద్ధమైంది. చూడటానికి ఎంతో చక్కగా కుందనపు బొమ్మలా ఉండే పూజా హెగ్డేలో ముక్కు తన అందాన్ని చెడగొడుతుందని చాలామంది ఆమె సన్నిహితులు తనకు సూచనలు చేశారట. 
 
ఈ క్రమంలోనే తాను మరింత అందంగా కనిపించడం కోసం పూజా హెగ్డే ముక్కు సర్జరీ చేయించుకోవాలని సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ విధంగా ముక్కుకు సర్జరీ చేయించుకొని ఈ బుట్టబొమ్మ మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుందనే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ క్రమంలోనే పలువురు ఈమె అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ చూడటానికి ఎంతో చక్కగా ఉన్నారు అయితే మరి సర్జరీలు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సర్జరీ విషయంలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే ఈ విషయంపై పూజా హెగ్డే స్పందించాల్సి ఉంది.