శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (12:25 IST)

'బాహుబలి' ప్రభాస్ సరసన కన్నడ నటి... రూ.150 కోట్లతో కొత్త చిత్రం

రెండు భాగాలుగా వచ్చిన 'బాహుబ‌లి' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ ఓ కొత్త చిత్రంలో నటించనున్నారు. ఐదేళ్ళ పాటు ఈ ప్రాజెక్టులో నిమగ్నమైన ప్రభాస్.. ఇటీవలే ఆ చిత్రం షూటింగ్‌

రెండు భాగాలుగా వచ్చిన 'బాహుబ‌లి' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ ఓ కొత్త చిత్రంలో నటించనున్నారు. ఐదేళ్ళ పాటు ఈ ప్రాజెక్టులో నిమగ్నమైన ప్రభాస్.. ఇటీవలే ఆ చిత్రం షూటింగ్‌ నుంచి బయటపడ్డారు. దీంతో తన కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళం, హిందీ భాషల్లో రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. 
 
ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌న్నడ హీరోయిన్ ర‌ష్మికా మండ‌న్నా న‌టించ‌నుంది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లై హిట్ అయిన 'కిర్రిక్ పార్టీ'లో ఈమె న‌టించింది. ఇప్పుడు అమరేంద్ర బాహుబ‌లితో జ‌త క‌ట్ట‌నుండ‌టం రష్మికి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. 
 
నిజానికి ఈ చిత్రంలో నాయిక‌గా ఎంపిక చేయ‌డానికి ముగ్గురి పేర్లను పరిశీలించారు. వీరిలో ఒకరు కన్నడ న‌టి ర‌ష్మికా మండ‌న‌. ఈమె చిత్ర కథ వినగానే నటించేందుకు సమ్మతం తెలిపిందట. అలాగే, దిశా ప‌ఠానీ, శ్ర‌ద్ధా క‌పూర్ పేర్లను కూడా పరిశీలించినప్పటికీ.. దర్శక నిర్మాతలు మాత్రం రష్మికవైపే మొగ్గు చూపారట. 
 
కాగా, యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి "ర‌న్ రాజా రన్" ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. ఈ చిత్రం బాహుబలి విడుదల తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.