Daily Horoscope
✕

మేలో పుష్ప ది రైజ్ షూటింగ్ ?

Written By డీవీ
Updated: గురువారం, 24 మార్చి 2022 (15:26 IST)
Allu arjun, Sukumar, Devisree Prasad
పుష్ప సీక్వెల్ పుష్ప ది రైజ్ షూటింగ్ ఇంత‌కుముందు చెప్పిన‌ట్లు ఏప్రిల్ జ‌ర‌గ‌డంలేద‌నీ మేలో కానీ జూన్‌లో జ‌ర‌గ‌నున్న‌ద‌ని ఓ టాక్ ఫిలింన‌గర్‌లో వినిపిస్తోంది. అన్నీ అనుకూలంగా వుంటే ఏప్రిల్‌లో జ‌ర‌గ‌నుంది. కానీ సాంకేతిక స‌మ‌స్య‌తో ఈ చిత్రం షూటింగ్ మేకానీ, జూన్ కానీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టికి అట‌వీ ప్రాంతంలో షూటింగ్ చేయాలంటే కొంత‌మేర‌కు వ‌ర్షంకూడా తోడుకావాల‌ట‌. అందుకోసం ఆ స‌మ‌యం బెట‌ర్ అని భావించిన‌ట్లు స‌మాచారం. 
 
ఇక ఈ సినిమా మొద‌టి భాగంలో స‌మంత చేసిన ఐటెం సాంగ్ యూత్‌లోఒక ఊపు ఊపింది. సీక్వెల్‌లోకూడా సంద‌ర్భానుసారంగా మ‌రో పాట వుండాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకు దిశా పటానిను కానీ, త‌మ‌న్నాను కానీ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే గ‌ని సినిమాలో ఆమె న‌టించింది. ఇక ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌చేయాల‌నే ముందుగా ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో ఈ సినిమాను 2023 సంక్రాంతి బ‌రిలో వుండ‌బోతోంద‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లో దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.

అన్నీ చూడండి

Hyderabad: మత్తుమందు కలిపిన బీరు ఇచ్చి బంగారం దోచిన ముఠా అరెస్ట్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి మీడియా సిటీ

వినికిడి లోపంతో వున్న మహిళపై లైంగిక దాడి.. వ్యక్తి అరెస్ట్

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన ఫెడరల్ కోర్టు : విదేశీ విద్యార్థులకు కోర్టు ఊరట

160 యేళ్ల చరిత్ర కలిగిన కుమార కృపలో కర్నాటక సీఎం గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఈ వ్యాధిగ్రస్తులకు కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఎవరు?

ప్రాణాంతక యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ముప్పును తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

బ్రిటిష్ పోషకాహార శాస్త్రాన్ని భారతదేశానికి పరిచయం చేస్తూ, షిఫ్ట్‌లైఫ్ యాంటీ-స్పైక్ డైలీని ఆవిష్కరించిన మోడికేర్

శక్తినిచ్చే 8 ఆహార పదార్థాలు, ఏంటవి?

బ్రౌన్ రైస్ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments