1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Ram Charan and Chiru angry on Nayanatara, why?

చిరంజీవి, రాంచరణ్‌లకు కోపం తెప్పించిన నయతార... ఎందుకు?

Ram Charan
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో వచ్చేసింది. ఆడియన్స్‌లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. మహా అంటే ఇంకో నాలుగు రోజులు ఉంటుంది సాహో టాక్. ఇక ఆ తరువాత మరో నెలలో రాబోతున్న సైరా పైనే అందరి చూపులు పడుతున్నాయి. రేపోమాపో ప్రమోషన్స్‌లో స్పీడ్ కూడా పెంచేస్తారు. ఆడియోతో సహా ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ప్లాన్ చేయాలి. ఇప్పుడు మూవీ టీం అదే ప్లాన్లో ఉందట. 
 
ఇప్పటివరకైతే రెండు రాష్ట్రాల్లో ఒక్క పోగ్రామ్ కూడా జరగలేదు. అందుకే ఓ బిగ్ ఈవెంట్‌తో సైరాకు పబ్లిసిటీ కోసం ప్లాన్ చేస్తున్నారట. అయితే నయనతార మాత్రం తాను ఇక్కడకు వచ్చేది లేనిది ఏ క్లారిటీ చెప్పలేదట. షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇక నాకేంటి అన్న విధంగా ఉంటోందట నయనతార. 
 
మూవీ టీం సంప్రదింపులు చేసినా నయనతార మాత్రం సరిగ్గా స్పందించడం లేదట. అయితే నయన్ ఏ సినిమా చేసినా కూడా ప్రమోషన్స్‌లో పాల్గొనదు. మూవీ టీం ముందు నుంచి విషయంపై అగ్రిమెంట్ కూడా తీసుకున్నదట. అయితే ఈ సినిమా స్పెషల్ కాబట్టి ఈ సినిమా ప్రమోషన్స్‌కు సహకరించమని రామ్ చరణ్ కోరారట. దానికి నయనతార ఓకే చెప్పినా ఇప్పుడు మాత్రం తాను వస్తానో రానోనన్న విషయాన్ని అస్సలు స్పష్టం చేయడం లేదట. దీంతో సైరా టీం.. ముఖ్యంగా రాంచరణ్, చిరంజీవిలు నయనతారపై కోపంగా ఉన్నారట.
About Writer
జె
తర్వాతి కథనం
పాయల్ రాజ్‌తో కలిసి 'డిస్కోరాజా' కిక్ ఇస్తాడట... మరి అది ఎలాంటిదో?