అలా పట్టుకున్న సీన్లను కట్ చేయడంతో కాజల్‌కు చిర్రెత్తుకొచ్చిందట..?

Kajal Agarwal
జె| Last Modified శనివారం, 24 ఆగస్టు 2019 (17:55 IST)
టాలీవుడ్ చందమామకు కోలీవుడ్ సెన్సార్ బోర్డుపై కోపమొచ్చింది. ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఇన్ని కట్లా అంటూ ఆమె ఫైర్ అవుతోంది. ఇలా కత్తిరించడం తనకు నచ్చలేదట. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన పారిస్ పారిస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో సక్సెస్ అయిన క్వీన్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది.

ఇటీవల ఈ సినిమా సెన్సార్ ముందుకు తీసుకెళ్ళారు. అయితే అక్కడ సినిమా టీంకి పెద్ద షాక్ తగిలింది. సినిమాలో అసభ్యకర సన్నివేశాలున్నాయన్న సెన్సార్ బోర్డు ఏకంగా 25 సీన్లను కట్ చేసేసింది. దీంతో కాజల్‌కు చిర్రెత్తుకొచ్చింది. దక్షిణాదిలో అన్ని బాషల్లో క్వీన్‌ను రీమేక్ చేశాం. అసలు సెన్సార్ వాళ్ళు ఎందుకు అన్ని కట్లు చేశారో అర్థం కాలేదు.

మేము ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించలేదు. సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్లలో నిజంగా అందరి జీవితాల్లో జరిగేవే. ఆ సన్నివేశాలను తిరిగి సినిమాలో పెట్టాలని కోరుతోంది కాజల్. మొదట్లో కోపంతో ఊగిపోయినా ఆ తరువాత సెన్సార్ బోర్డు కదా కాస్త తగ్గింది.దీనిపై మరింత చదవండి :