శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (14:13 IST)

జిమ్‌లో శ్వేదం చిందేలా వ్యాయామం చేస్తున్న రాంచరణ్ - ఉపాసన

రాంచరణ్ భార్య ఉపాసన అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజగా తన భర్త చ

రాంచరణ్ భార్య ఉపాసన అప్పుడప్పుడు తన సోషల్ మీడియా ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజగా తన భర్త చరణ్‌తో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తున్న ఒక వీడియో ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వీరిద్దరూ కలిసి వ్యాయామశాలలో తెగ కసరత్తులు చేస్తున్నారు. 
 
తన భర్తతో వ్యాయామం చేయడమంటే నాకిష్టం. ఇప్పుడు మిస్టర్ సి(చరణ్) గోల్స్‌ను సెట్ చేస్తారు, మేము తరచూ దీన్ని చేస్తూ ఉండాలని ఆశిస్తున్నా అని ఉపాసన ట్వీట్ చేసింది. ఈ వీడియోలో రాంచరణ్ చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని చాలా సీరియస్‌గా వ్యాయామం చేస్తున్నారు. 
 
మరో పక్క ఉపాసన కూడా అదే రేంజ్‌లో వ్యాయామం చేస్తోంది. మెగా కోడలు పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కెర్లు కొడుతోంది. రాంచరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధృవ' చిత్రంలో నటిస్తూ బిజిబిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.