మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (22:57 IST)

రియ‌ల్ ప్రేమ దొర‌క‌లేదంటున్న రాశీఖ‌న్నా

zene kotwal, Rasi khanna
రీల్‌లైఫ్‌లో ఎంతోమందిని ప్రేమించాను. ప్రేమించాల్సి వ‌చ్చింది. కానీ రియ‌ల్ లైఫ్‌లో ఇంకా ప్రేమ‌లో ప‌డ‌లేదు. అని చెబుతోంది హీరోయిన్‌ రాశీఖన్నా. ఆదివారంనాడు స్నేహితురాలు దియామీర్జా పెండ్లి స‌మ‌యంలో వ‌ధూవ‌రుల‌కు శుభాకాంక్ష‌లు చెప్పింది. ఈ సంద‌ర్భంగా మ‌రో స్నేహితురాలు నీ పెళ్ళెప్పుడు ఎవ‌రినైనా ప్రేమించావా! అని స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించింది.

‘‘నేను ఇప్పటికీ సింగిల్‌, నా మనసులో ఎవరూ లేరు. ఒకవేళ ఎవరితోనైనా ప్రేమలో పడితే డేటింగ్‌ చేసేందుకు సిద్ధం. నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను’’ అని రాశీఖన్నా బ‌దులిచ్చింది. నాకున్న కొద్ది మంది స్నేహితురాలిల‌లో జినా కొత్వాల్ ఒక‌రని ఇటీవ‌లే చెప్పింది. ఇద్ద‌రూ స్విమ్ సూట్‌లో స్విమ్మింగ్ చేస్తున్న ఫొటోను కూడా పెట్టింది. ప్ర‌స్తుతం రాశీ హిందీలో షాహిద్‌ కపూర్‌ సరసన ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.