జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. కృష్ణవంశీ దర్శకత్వంలో..?

jhanvi kapoor
jhanvi kapoor
సెల్వి| Last Updated: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (10:07 IST)
అందాల తార జాన్వీ కపూర్ త్వరలోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. మంచి ఆఫర్ వస్తే తన కూతుర్ని టాలీవుడ్‌కి పరిచయం చేయాలని తండ్రి బోనీకపూర్ కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జాన్వీకి తెలుగు చిత్రసీమ నుంచి మంచి ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి సినిమాను మహిళా ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో జాన్వీని కథానాయికగా తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారట. కథను కూడా జాన్వీని దృష్టిలో పెట్టుకునే ఆయన తయారుచేశారట.

ప్రస్తుతం ఈ ప్రాజక్టు గురించి సంప్రదింపులు జరుగుతున్నట్టు, జాన్వీ కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. శ్రీదేవి తనయ 'గుంజన్ సక్సేనా' సినిమా నటిగా ఆమెకు మరింత పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె హిందీలో 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' చిత్రాలలో నటిస్తూ బాలీవుడ్‌లో బిజీగా వుంది.దీనిపై మరింత చదవండి :