మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (12:18 IST)

రష్మీకి దిమ్మ తిరిగిపోయింది.. ''చారుశీల''కు చేదు అనుభవం.. యూఎస్‌లో ఒక్క షోకే?

బుల్లితెర మీద ''జ‌బ‌ర్థ‌స్త్'' యాంక‌ర్ అనిపించుకున్న రేష్మీ గౌత‌మ్‌, ఇప్పుడు వెండితెర మీద కూడా పేరు సంపాదించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ప్ర‌స్తుతం రేష్మీ, రాజీవ్ క‌న‌కాల‌ న‌టించిన ''చారుశీ

బుల్లితెర మీద ''జ‌బ‌ర్థ‌స్త్'' యాంక‌ర్ అనిపించుకున్న రేష్మీ గౌత‌మ్‌, ఇప్పుడు వెండితెర మీద కూడా పేరు సంపాదించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ప్ర‌స్తుతం రేష్మీ, రాజీవ్ క‌న‌కాల‌ న‌టించిన ''చారుశీల'' సినిమా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

త‌మిళంలో విడుద‌లైన ''జూలీ గ‌ణ‌ప‌తి'' చిత్రాన్ని కాపీ కొట్టి చారుశీల‌ను తీశార‌ని ఓ డైరెక్ట‌ర్ కేసు పెట్టాడు. దీంతో చారుశీల‌పై ఆశ‌లు పెట్టుకున్న రేష్మీకి విడుద‌ల‌కు ముందే అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతుండ‌గా త‌న కేరీర్ ఏమ‌వుతుందో అనే ఆలోచ‌న‌లు ప‌డింది. ఈ ఘటన నుండి తేరుకోకముందే రష్మీకి యూఎస్‌లో చేదు అనుభవం ఎదురైంది. 
 
ఈ సినిమాకు సంబంధించి యూఎస్ ప్రీమియర్ షోస్‌ని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో తమ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయన ఆశతో ప్రీమియర్ షోస్ వేశారట యూనిట్ సభ్యులు. యూఎస్ లో చిన్న సినిమా షోస్ పడాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది.

చారుశీల యూనిట్ కూడా ఆ కష్టాన్ని ఎదుర్కొని, చివరికి ప్రీమియర్ షో వేసింది. అయితే అంత కష్టపడి ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తే కనీసం ఒక్కరు కూడా షోకి రాలేదట దాంతో ఆ షో పెట్టిన వాళ్ళు తల ఎక్కడ పెట్టుకొవాలో తెలియక ఖంగు తిన్నారట. ఈ విషయం తెలుసుకున్న రష్మీకి దిమ్మతిరిగిపోయిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.