శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (15:20 IST)

'జబర్దస్త్' నుంచి రష్మీ ఔట్... హరితేజకు ఛాన్స్...

ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుంచి హాట్ యాంకర్ రష్మీ తప్పుకోనున్నారు. ఆమె స్థానంలో సరికొత్త యాంకర్ హరితేజ కనిపించనుందే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ కార్యక్రమానికి మంచి ఊపు తెచ్చ

ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో నుంచి హాట్ యాంకర్ రష్మీ తప్పుకోనున్నారు. ఆమె స్థానంలో సరికొత్త యాంకర్ హరితేజ కనిపించనుందే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఈ కార్యక్రమానికి మంచి ఊపు తెచ్చిన యాంకర్లలో రష్మీ ఒకరు. గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది.
 
ఈ నేపథ్యంలో 'స్టార్ మా'లో ప్రసారమైన 'బిగ్ బాస్' షో ద్వారా హరితేజ బాగా పాపులర్ అయింది. ఆమె అందరి మనసులను ఎక్కువగా దోచుకుంది కూడా. ఈ కారణంగా ఆమెను రష్మీ ప్లేస్ లోకి తీసుకోవాలనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్టుగా సమాచారం. అయితే రష్మీని తప్పించడం లేదు .. ఆమెనే తప్పుకుంటోందనే టాక్ కూడా వినిపిస్తోంది.