Dharma Sangrah

రేణు దేశాయ్ రెండో పెళ్లి.. జరిగిందా? జరగలేదా?

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 29 మే 2022 (17:01 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ రెండో పెళ్లి అప్పట్లో సంచలనమైంది. కానీ ఆ పెళ్లిపై ఆమె ఊసెత్తలేదు. అసలు పెళ్లి జరిగిందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎవరికి కూడా క్లారిటీ రాలేదు.
 
గతంలో సరదాగా ఆలీతో షో కి వచ్చిన రేణుదేశాయ్ తన రెండో భర్త గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పింది. అతడు ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడని తెలిపారు. ముందు అతడు అమెరికాలో ఉద్యోగం చేసేవాడని.. తండ్రికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇండియాకు వచ్చి పూణేలో ఐటి ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పింది. 
 
రెండో పెళ్లి పై చాలా రోజుల పాటు తాను ఆలోచన చేశానని. అయితే తన కోసం.. తన పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోక తప్పడం లేదని ఓ సందర్భంలో ప్రస్తావించింది. రేణు దేశాయ్ పాల్గొన్న అదే షోలో రేణుక కాబోయే రెండో భర్త ఓ వాయిస్ ఓవర్ కూడా పంపించాడు. అతడు రేణును ఆకాశానికి ఎత్తేయడంతో పాటు తన జీవితం ఎంతో సంతోషంగా ఉండటానికి కారణం అంటూ ఆమెను మెచ్చుకున్నాడు.
 
అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి కూడా ఏడాది అయింది. అయితే ఇప్పటివరకు రేణు రెండో భర్త ఎవరు?అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు రేణు - పవన్ కలిశారు. రేణు దేశాయ్ పిల్లలు మాత్రం ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీతో కలుస్తూనే ఉన్నారు. అకీరా స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తైన సందర్భంగా కూడా ఆ ఫంక్షన్‌కు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యాడు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లోనే మొట్టమొదటి డైరెక్ట్ మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్ ఎల్బీ నగర్‌లో ఏర్పాటు

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ కేసు: తొలుత ప్రియురాలు మాధురి సూసైడ్ ఎటెంప్ట్, ఇప్పుడు అదే దారిలో భార్య

యూపీఐ చార్జీలు కాదు.. యూపీఐ ట్యాక్స్ : రాహుల్ గాంధీ

శృంగారానికి నిరాకరించిన ప్రియురాలు.. ఆవేశంతో చంపేసిన ప్రియుడు...

వేధింపులు భరించలేక మామను హత్య చేసిన కోడలు.. కేసులో సరికొత్త ట్విస్ట్

అన్నీ చూడండి

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments