1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 25 మే 2022 (16:00 IST)

పవన్ కల్యాణ్: ‘‘కోనసీమలో గొడవలు జరగాలనే వైసీపీ కోరుకుంది’’

Pawan kalyan
వైసీపీకి నిజంగా అంబేడ్కర్‌పై ప్రేమ ఉంటే ఎస్సీ సబ్ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం ఆయన మంగళగిరిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానాన్ని పెట్టి, కోనసీమకు మాత్రం మరో విధానాన్ని అనుసరించారని ఆరోపించారు.

 
జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టడానికి జాప్యం చేయడంలో ఉద్దేశ్యం ఏంటి? అని ప్రశ్నించారు.

 
‘‘పేర్లు పెట్టేటప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాల్సి ఉంది. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పేరు పెట్టారు. కృష్ణా నది ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ పేరు పెట్టారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారు. దీన్ని బట్టే వైసీపీ వైసీపీ దురుద్దేశం అర్థమవుతోంది. గొడవలు జరగాలని వైసీపీ అనుకుంది. మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి?’’ అంటూ ఆయన నిలదీశారు.