పవన్ కల్యాణ్ ఆలోచనలో మార్పు.. సముద్రఖని ప్రాజెక్టును..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు షూటింగ్‌లో బిజీ బీజీగా వున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని భావించిన యూనిట్ షూటింగ్ చేయని కారణంగా సినిమాను పూర్తి చేయని కారణంగా ఇప్పుడు ఆలస్యంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
ఇక ఇదే మే నెలలో మిగిలిన షూటింగ్ చేయబోతున్నారు. అలా త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు.
ఈ చిత్రం మాస్ మసాలా సినిమాగా తెరకెక్కుతోంది. ఇకపోతే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇవేకాకుండా మరొక రెండు సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సుజీత్ దర్శకత్వంలో తేరీ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు సుజిత్.
ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వంలో ఓ తమిళ రీమేక్ సినిమాలో సైతం పవన్ నటించేందుకు సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. కానీ హరీశ్ శంకర్‌తో కంటే ముందుగా సముద్రఖని ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనలో పవన్ వున్నట్లు తెలుస్తోంది.
ఆ దిశగానే జరుగుతున్న సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఐదు ప్రాజెక్టులను ఎన్నికల్లోపు పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ వున్నట్లు వార్తలు వస్తున్నాయి.