Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లుక్ ఆగస్టు 15న వచ్చేస్తుందట.. ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశాడట..

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు

Written By Selvi
Updated: శనివారం, 29 జులై 2017 (17:24 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‌‍తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఇంకా పాల్గొనలేదు. అయితే ఆయన లుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
తొలుత ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్‌, టీజర్‌ను వదిలారు. ఆ తర్వాత ఎలాంటి లుక్స్ విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి2 తర్వాత రాజమౌళి సినిమా ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రభాస్‌ కోసం పక్కా కమర్షియల్‌ కథను రెడీ చేశారట రాజమౌళి. అయితే ప్రభాస్, రాజమౌళి రేంజ్‌ను మరింత పెంచే విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.

అన్నీ చూడండి

భాజపాకి షాకిచ్చిన PK, 3 దశాబ్దాల కోటను బద్ధలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

వివాహం చేసుకోలేదని మహిళలకు రక్షణను నిరాకరిస్తారా?: సుప్రీం కోర్టు

మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. ఏమైనా పనికొచ్చిందంటారా?

సహజీవనంలో ఉండే మహిళలకు కూడా గృహహింస చట్టం : సుప్రీంకోర్టు

Khammam: రీల్స్ చేస్తూ సస్పెండ్ అయిన టీచర్.. ఉద్యోగానికి రాజీనామా.. ఎందుకంటే? (video)

అన్నీ చూడండి

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

తర్వాతి కథనం
Show comments