ప్రగ్యా జైస్వాల్‌కు కెమిస్ట్రీ పాఠాలు బోధిస్తున్న కృష్ణవంశీ...
సందీప్ కిషన్ హీరోగా రెజీనా హీరోయిన్‌గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నక్షత్రం. ఈ సినిమాలో చిన్న హీరో తనీష్… విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అంతేకాక ఈ చిత్రంలో ఓ కీలకమైన పా
సందీప్ కిషన్ హీరోగా రెజీనా హీరోయిన్‌గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నక్షత్రం. ఈ సినిమాలో చిన్న హీరో తనీష్… విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అంతేకాక ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఇప్పటికే సాయిధర్మతేజ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కంచె హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా నక్షత్రంలో చేరింది.
ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ఫేస్‌బుక్ ఎకౌంట్ ద్వారా తెలియజేశాడు. హరివిల్లు లాంటి అందమైన ''నక్షత్రం''లో అందాల భామ ప్రగ్యా జైస్వాల్ మెరవనుందని తెలిపాడు. ప్రగ్యా జైస్వాల్ ఓ శక్తివంతమైన పోలీస్ పాత్రలో సాయిధరమ్ తేజ్‌కు ఆపోజిట్‌గా నటించబోతోంది. ఇదిలావుంటే... కృష్ణవంశీ ఏ సినిమా తీసినా హీరోహీరోయిన్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంటాడు. వాళ్లిద్దరికీ సినిమాపట్ల విలువైన సలహాలు ఇస్తుంటాడు.
ఈ మధ్య నక్షత్రం సినిమా విషయంలో కూడా సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌కి కృష్ణవంశీ బోలెడన్ని కెమిస్ట్రీ పాఠాలు చెప్పాడట. ఆ పాఠాలకి అనుగుణంగానే ఆ ఇద్దరూ డేటింగ్‌లు కూడా మొదలుపెట్టారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అదే సినిమాలో రెజీనా నటిస్తున్నప్పటికీ సాయిధరమ్ తేజ్ మాత్రం ప్రగ్యాతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నాడట. దీంతో వారిద్దరి మధ్య డేటింగ్ మరో స్థాయికి వెళ్లిందని టాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.