బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:00 IST)

పెళ్ళయిన హీరోతో రొమాన్స్ చేస్తానంటున్న సాయిపల్లవి...

ఫిదా చిత్రంతో యువకుల మనసు దోచుకున్న సాయిపల్లవి హీరో సూర్యకు గాలం వేస్తోంది. మలయాళంలో నటించిన మొదటి సినిమా ప్రేమమ్ సినిమాతో అక్కడి ప్రజల ప్రేమాభిమానాలను పొందింది సాయిపల్లవి. దీంతో కోలీవుడ్ కన్ను పల్లవిపై పడింది. మణిరత్నం లాంటి ప్రముఖ దర్శకులు అవకాశం క

ఫిదా చిత్రంతో యువకుల మనసు దోచుకున్న సాయిపల్లవి హీరో సూర్యకు గాలం వేస్తోంది. మలయాళంలో నటించిన మొదటి సినిమా ప్రేమమ్ సినిమాతో అక్కడి ప్రజల ప్రేమాభిమానాలను పొందింది సాయిపల్లవి. దీంతో కోలీవుడ్ కన్ను పల్లవిపై పడింది.


మణిరత్నం లాంటి ప్రముఖ దర్శకులు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నా నటుడు విక్రమ్‌తో జతకట్టే ఛాన్స్ వచ్చినా ఎంబిబిఎస్ చదువుతున్నానని చెప్పి సాయిపల్లవి అవకాశాలను సున్నితంగా తిరస్కరించింది. ఫిదా సినిమా రాక ముందు సంగతి ఇది. దీంతో తమిళ సినీ పరిశ్రమలకు సాయిపల్లవి వెళ్లలేదు. చివరకు ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అందరి హృదయాలను కొల్లగొట్టింది.
 
ఫిదా తరువాత కోలీవుడ్‌లో విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రంలో నటిస్తోంది సాయి పల్లవి. ఈ చిత్రం తరువాత ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలు చేయడానికి సిద్థంగా ఉంది. ఇదిలావుంటే తమిళ సినీ పరిశ్రమలో ఉన్న సాయిపల్లవి హీరో సూర్య అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన సినిమాలు అస్సలు మిస్సయ్యేదాన్ని కాదని చెబుతోంది. అంతేకాదు సూర్య లాంటి హీరోతో రొమాన్స్ చేసే అవకాశం వస్తే ఎప్పుడూ తాను సిద్ధమేనని చెపుతోంది. ఇష్టమైన హీరో ఓకే.. ఇష్టమైన నటి ఎవరు అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే అనుష్కనే అంటూ టక్కున చెప్పిందట సాయిపల్లవి.