బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (17:58 IST)

బిగ్ బాస్ : ఒక్కో ఎపిసోడ్‌కు రూ.11 కోట్లు తీసుకుంటున్న సల్మాన్ ఖాన్?

బిగ్ బాస్ బాలీవుడ్ నుంచి దక్షిణాదికి వచ్చేసింది. హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో క్రేజ్‌తో తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కోలీవుడ్‌లో సినీ లెజెండ్ కమల్ హాసన్‌ బిగ్ బాస్ రియాల్టీ షోలను హోస్ట

బిగ్ బాస్ బాలీవుడ్ నుంచి దక్షిణాదికి వచ్చేసింది. హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో క్రేజ్‌తో తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కోలీవుడ్‌లో సినీ లెజెండ్ కమల్ హాసన్‌ బిగ్ బాస్ రియాల్టీ షోలను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో అక్టోబర్ 1 నుంచి బిగ్  బాస్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరించేందుకు సల్మాన్ ఖాన్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
 
బిగ్ బాస్ 10 ఎపిసోడ్‌కి రూ.8కోట్ల చొప్పున సల్మాన్ ఖాన్ పారితోషికంగా తీసుకున్నాడు. అయితే బిగ్ బాస్ 11వ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్‌కి రూ.11 కోట్ల చొప్పున సల్మాన్ ఖాన్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షోలో పాల్గొంటున్న సెల‌బ్రిటీల‌కు పెద్ద మొత్తంలో పారితోషికం ఇస్తుండ‌గా, సాధార‌ణ పౌరుల‌కు మాత్రం ఎలాంటి పారితోషికం ఇవ్వ‌డం లేద‌నే వార్త కూడా చ‌క్క‌ర్లు కొడుతోంది. 
 
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షో నాలుగో సీజన్‌ నుంచి ఆరో సీజన్ వరకు సల్మాన్ ఖాన్ రూ.2.5 కోట్ల మేర ఒక్కో ఎపిసోడ్‌కు తీసుకున్నాడని.. బిగ్ బాస్ ఏడో సీజన్‌కు వచ్చే సరికి ఆ మొత్తం రూ.5కోట్లకు రెండింతలు అయినట్లు బాలీవుడ్‌లో టాక్. 2014లో రూ.5.5, 2015 (బిగ్ బాస్ 9)లో రూ.7-8 కోట్ల మేర పారితోషికంగా పుచ్చుకున్నట్లు బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి.