శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (12:00 IST)

పాదాలకు బంగారం గొలుసులు ధరిస్తే? అంతా గోవిందా?

ఫ్యాషన్ పేరిట బంగారు గొలుసులను కాళ్లకు ధరిస్తున్నారా? అయితే శ్రీ మహాలక్ష్మీ దేవిని అవమానించినట్లవుతుందని పండితులు అంటున్నారు. బంగారు వర్ణంతో కూడిన గొలుసులను కాళ్లకు ధరించినట్లైతే సంపదల తల్లి అయిన లక్

ఫ్యాషన్ పేరిట బంగారు గొలుసులను కాళ్లకు ధరిస్తున్నారా? అయితే శ్రీ మహాలక్ష్మీ దేవిని అవమానించినట్లవుతుందని పండితులు అంటున్నారు. బంగారు వర్ణంతో కూడిన గొలుసులను కాళ్లకు ధరించినట్లైతే  సంపదల తల్లి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుందని.. తద్వారా సిరిసంపదలు దూరమైపోతాయని వారు చెప్తున్నారు. బంగారం పూజ్యనీయమైందని.. అందుకే వాటిని మెడలో చేతులకు ధరించవచ్చు కానీ, కాళ్లకు మాత్రం వాటిని ధరించడం మంచిదికాదు. సైన్స్ పరంగా చూస్తే బంగారం నగలు శరీరానికి ఉష్ణాన్నిస్తాయి. అదే వెండి ఆభరణాలు చలువనిస్తాయి. 
 
కాళ్లకు వెండిని ధరిస్తే.. తలలో ఏర్పడే ఉష్ణాన్ని తగ్గిస్తుంది. అదే బంగారం ధరిస్తే.. తలలో ఏర్పడే ఉష్ణాన్ని ఏమాత్రం తగ్గించలేదు. అందుకే ఉష్ణాన్నిచ్చే బంగారాన్ని మెడకు, చేతులకు మాత్రమే పరిమితం చేయాలి. కాళ్లకు ధరించే గొలుసులు వెండితో తయారైనవై వుండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వెండి గొలుసులను ధరించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
 
నడుమునొప్పి, మోకాలి నొప్పి, హిస్టీరియాను నయం చేసుకోవచ్చు. వెండిని గొలుసులుగా ధరించడంతో మెదడు పనితీరు మెరుగవుతుంది. తద్వారా సహనం ఏర్పడుతుంది. చికాకు దూరమవుతుంది. అదే బంగారాన్ని ధరిస్తే.. అందుకు వ్యతిరేకంగా పనులు సాగుతాయి. అందుకే  పాదాలకు బంగారు ఆభరణాలు ధరిస్తే ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని పండితులు అంటున్నారు. 
 
అలాగే ఇంట్లో వున్న బంగారాన్ని ఈశాన్య ప్రదేశంలో భద్రంగా ఉంచాలి. పిల్లల కోసం ప్రయత్నిస్తోన్న వారు కుడిచేతి ఉంగరపు వేలికి బంగారంతో చేసిన ఆభరణాలు ధరిస్తే ఫలితం ఉంటుంది. దీని వల్ల గ్రహస్థితిలో మార్పులు చోటుచేసుకుని, అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా మహిళలు ఎడమచేతికి స్వర్ణాభరణాలు ధరించకూడదు. ఇతరుల నుంచి బంగారం తీసుకోవడం అధిక వ్యయానికి కారణమవుతుంది. బంగారపు ఆభరణాలు చేజార్చుకుంటే ఆరోగ్య సమస్యలకు సంకేతమని పండితులు చెప్తున్నారు.