1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (06:24 IST)

ప్రాణంతీసిన 'బతుకమ్మ' చీర... బస్తీ మే సవాల్ అంటున్న ఆడబిడ్డలు

తెలంగాణ సర్కారు ఆడబిడ్డల కోసమంటూ తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పథకం తీవ్ర విమర్శలపాలైంది. బతుకమ్మ చీరలు ఒకవైపు మంటలు రేపుతుంటే మరోవైపు బస్తీ మే సవాల్ అని ఫైటింగ్ చేయిస్తున్నాయి.

తెలంగాణ సర్కారు ఆడబిడ్డల కోసమంటూ తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పథకం తీవ్ర విమర్శలపాలైంది. బతుకమ్మ చీరలు ఒకవైపు మంటలు రేపుతుంటే మరోవైపు బస్తీ మే సవాల్ అని ఫైటింగ్ చేయిస్తున్నాయి. మంచినీళ్ల నల్లా కాడ మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకున్న రోజులు గతంలో ఎన్నో చూశాం. కానీ ఈ రోజుల్లో ఆ తరహా కొట్లాటలు కనుమరుగయ్యాయి.
 
తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన బతుకమ్మ చీరల పథకం నల్లా పంచాయతీలను ముందుకు తెచ్చింది. చీరల కోసం హైదరాబాద్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో కొందరు మహిళలు బస్తీ మే సవాల్ అని సిగలు పట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించారు. ఇంకొందరేమో చీరల కోసం ముష్టిఘాతాలకు దిగారు. దీంతో సరస్వతి శిశుమందిర్ ప్రాంగణం యుద్ధవాతావరణాన్ని తలపించింది. నాసిరకం చీరలిచ్చారని కొందరు కాలబెట్టారు.
 
మోత్కూరులో బతుకమ్మ చీరల పంపిణీ వద్ద రూ.50 చీరలు పంచుతారా అని ఎమ్మెల్యే కిషోర్‌ని మహిళ నిలదీసింది. దీంతో ఆ మహిళను అరెస్టు చేశారు. అలాగే, బతుకమ్మ చీరకోసం వచ్చిన ఓ మహిళ మృతి చెందింది. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం కొట్టాలకు చెందిన విజయమ్మ మధ్యాహ్నం బతుకమ్మ చీర కోసం వచ్చింది. క్యూలో నిలబడి సోమ్మసిల్లి పడిపోయింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందింది.