శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (13:02 IST)

హోటల్ ఫుడ్‌ను పక్కనబెట్టి.. ఇంటి భోజనం తీసుకుంటే?

హోటల్ ఫుడ్‌ను పక్కనబెట్టి.. ఇంటి భోజనం తీసుకుంటే? టైప్-2 మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. అమెరికాలోని టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్టడీలో నిత్యం ఇంటి భోజనం చే

హోటల్ ఫుడ్‌ను పక్కనబెట్టి.. ఇంటి భోజనం తీసుకుంటే? టైప్-2 మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. అమెరికాలోని టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్టడీలో నిత్యం ఇంటి భోజనం చేసేవారికి టైప్-2 మధుమేహం ముప్పు వుండదని పరిశోధకులు తెలిపారు. హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో భోజనం చేసే వారిలో టైప్-2 డయాబెటిస్ అవకాశాలున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. 
 
1986-2012 మధ్య కాలంలో 58,051 మంది మహిళలతో పాటు, 1986-2010 మధ్య కాలంలో 41,676 పురుషుల ఆహారపుటలవాట్లను పరిశీలించారు. వారిలో మొత్తం 9,325 మంది టైప్‌-2 మధుమేహం బారిన పడినట్లు అధ్యయనకారులు గుర్తించారు. ఇందుకు కారణం పురుషులు రెస్టారెంట్లు, హోటల్ ఆహారానికి అలవాటు పడటమేనని తేలింది. ఇంటి భోజనం తీసుకునే మహిళలు, పురుషుల్లో మధుమేహం ముప్పు చాలా తక్కువగా నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు.