శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (17:10 IST)

తిరుమలలో బంగారు బల్లులు... విచిత్ర శబ్దాలు, వాటి కథేంటి?

బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ బల్లులు ఉంటాయి. ఇంట్లో కాని, చెట్ల మీద గాని బల్లులను చూస్తూ ఉంటాం. బల్లులు సాధారణంగా గ్రే కలర్‌లో గాని, మట్టి కలర్‌లో గాని ఉంటాయి. తిరుమలలో గత వారంరోజులుగా బంగారు బల్లులు తిరుగుతుండటాన్ని భక్తులు గ

బల్లులంటే భయపడేవారు చాలామందే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ బల్లులు ఉంటాయి. ఇంట్లో కాని, చెట్ల మీద గాని బల్లులను చూస్తూ ఉంటాం. బల్లులు సాధారణంగా గ్రే కలర్‌లో గాని, మట్టి కలర్‌లో గాని ఉంటాయి. తిరుమలలో గత వారంరోజులుగా బంగారు బల్లులు తిరుగుతుండటాన్ని భక్తులు గుర్తించారు. 
 
అసలు బంగారు బల్లి కథేంటి... గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. నీటిలో బల్లి ఉండటాన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించారు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి ప్రార్థించారు. 
 
కొన్నాళ్ళకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు బల్లిని తాకడంతో అప్పటివరకు చేసిన పాపాలు పోతాయన్న నమ్మకం చాలామందిలో ఉంది. అలాంటిది అసలుసిసలు బంగారు బల్లి కనిపిస్తే.. దీనిపైనే ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు భక్తులు. 
 
శేషాచలం అడవులు తిరుమల శ్రీవారి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న శిలాతోరణం సమీపంలోని చక్రతీర్థ ప్రాంతంలో బల్లులను గుర్తించారు. ఈ బల్లులను గెకో అంటారు. గత కొన్ని సంవత్సరాలకు ముందు కనిపించిన ఈ బల్లులు ఆ తరువాత కనిపించలేదు. తాజాగా వారం రోజుల క్రితం కనిపించాయి. ఇవి జనాన్ని చూసి కూడా భయపడటం లేదు. ఒక్కోసారి విచిత్రంగా అరుస్తున్నట్లు జూ అధికారులు గుర్తించారు. ఈ బల్లులపై మరోసారి పరిశోధన జరపాలని వన్యప్రాణి సంరక్షణా విభాగం నిర్ణయించుకుంది.