బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:55 IST)

షాలినీ పాండేకు బాలీవుడ్ ఆఫర్.. రణ్ వీర్ సరసన నటించే ఛాన్స్

అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండేకు బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సరసన నటించే అవకాశం దక్కింది. అర్జున్ రెడ్డిలో ఆమె నటనని చూసిన రణ్ వీర్ 'జయేష్ బాయ్ జోర్దార్' సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ అమ్మడు సంతోషానికి అవధుల్లేవ్. ఇదేకాదు బాలీవుడ్‌లో ఒక వెబ్ సిరీస్‌లో సైతం ఆమెకి అవకాశం వచ్చింది. 
 
ఆదిత్య రావల్ హీరోగా నటిస్తున్న 'బమ్ ఫాడ్' అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా షాలినీకి అవకాశం దక్కింది. దీంతో ఆమె టాలీవుడ్‌కి టాటా చెప్పేసినట్టేనని అంటున్నారు. ఒక్క టాలీవుడ్‌కే కాదు దక్షిణాది చిత్రాలకి సైతం ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసిందట. 
 
కాగా.. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న షాలినీకి తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. అర్జున్ రెడ్డిలో నటనపరంగా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కానీ అవకాశాలు అంతగా రాలేదన్న విషయం తెలిసిందే.