బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (10:22 IST)

త్రివిక్రమ్-మహేష్ మూవీలో పెళ్లి సందD హీరోయిన్..

sree leela
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు త్వరలో ఓ సినిమాలో నటించనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. తాజాగా ఈ జంట మరోసారి ఏకం కానుంది. వీరిద్దరూ కలిసే ప్రాజెక్టుకు సంబంధించి ఓ న్యూస్ విడుదలైంది. SSMB28గా రానున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. 
 
త్రివిక్రమ్ రాసుకున్న కథ ప్రకారం ఇందులో మరో హీరోయిన్‌కి కూడా చోటుండటంతో ఈ ఛాన్స్ పెళ్లి సందD బ్యూటీ శ్రీలీలకు ఇచ్చారని తెలుస్తోంది.
 
మొదట ఈ రోల్ కోసం ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ని ఫైనల్ చేద్దామనుకున్న త్రివిక్రమ్.. చివరకు శ్రీలీలకు ఓటేశారని సమాచారం. అంతేకాదు మహేష్ బాబు- శ్రీ లీల నడుమ ఓ రొమాంటిక్ డ్యూయెట్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
 
హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై మమత సమర్పణలో ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించబోతున్న ఈ చిత్రంలో మహేష్ తండ్రిగా అనిల్ కపూర్ నటించనున్నారట. 
 
అంతేకాదు మహేష్ బాబు గతంలో ఎన్నడూ కనిపించని విధంగా సరికొత్త మేకోవర్‌తో కనిపించబోతున్నారట. చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు.