ఐటంసాంగ్లో బ్రహ్మానందంతో శ్రుతి హాసన్.... పండగే పండగ
హీరోయిన్ ఐటం సాంగ్ చేయడం మామూలే. అలాగే కమేడియన్ కూడా డాన్స్ చేయడం మామూలే. కానీ ఇద్దరు భిన్నమైన విధంగా నటించడం చిత్రమే. వివరాల్లోకి వెళితే.. నటి శ్రుతి హాసన్ ఓ చిత్రంలో ఐటంసాగ్ చేయనున్నది. ఈమె చేయాల్సిన పాత్ర గురించి అందులో వుండాల్సిన సాంగ్ గురించి ఇటీవలే ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలియజేసినట్లు తెలిసింది. ఇందుకు ఆమె గ్రీన్ స్నిగల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ చిత్రానికి కోన వెంకట్ పని చేయడం.. ఇందుకు ఉపయోగపడింది. అంతేకాకుండా ఇందులో ఆమెతో పాటు బ్రహ్మానందంపై ఓ పాట చిత్రించనున్నారు. బ్రహ్మానందం కెరియర్ను దృష్టిలో పెట్టుకుని భిన్నంగా రాసిన ఈ పాట వచ్చే నెలలో షూట్ చేయనున్నారు. ఇంతకీ ఈ చిత్రం క్రైమ్ కామెడీతో రూపొందుతోంది.
అంజలి ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి 'గీతాంజలి' అని పేరు పెట్టారు. హీరోయిన్గా ఒక స్థాయికి చేరిన శ్రుతి ఇలా ఐటంసాగ్ చేయడానికి దానికి భారీగా పారితోషికం ఇవ్వడానికి బిల్డర్ అయిన నిర్మాత అంగీకరించారట.