బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (12:29 IST)

సింగర్ సునీత, యాంకర్ సుమ ఆ పనిలో పడ్డారు..?

Sunitha
సింగర్ సునీత, యాంకర్ సుమ ఏ పనిలో పడ్డారనేగా మీ డౌట్ అయితే చదవండి. సుమ కనకాల టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా రాణిస్తోంది. ఇక సింగర్ సునీత ఫ్యామిలీ లైఫ్ చూస్తూ.. తన కెరీర్‌తో పాటు కుమారుడి సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. 
 
సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆమె కొడుకు చిత్రం “బబుల్ గమ్” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. కానీ, తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టాలి అనుకుంటోంది సుమక్క. 
 
అలాగే గాయని సునీత ఇటీవల రెండో వివాహం చేసుకున్నారు. తొలి భర్త ద్వారా ఆమెకు ఓ కుమారుడు, ఒక కుమార్తె వున్నారు. కొడుకు ఆకాష్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆకాష్ గోపరాజు మొదటి చిత్రం"సర్కార్ నౌకరి". ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. సునీత ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు.