రామ్ పోతినేనితో అనుపమ పెళ్లి?: క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి
ప్రేమమ్ తెలుగు రీమేక్‌తో తెలుగులో సూపర్ స్టార్ హీరోయిన్‌గా అనుపమ మారింది. ఇప్పటికే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ హీరోయిన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. టాలీవుడ్ ఎనర్జిటిక్, ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేనితో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో పడిందని.. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ఒకటవ్వాలని కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ప్రేమించుకోవడమే కాదు ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నరనే వార్త కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో షికారు చేయడంతో నటి తల్లి స్పందించింది.
ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీత ఇదంతా పుకార్లని..తప్పుడు వార్త అంటూ కొట్టిపారేసింది. అయితే అలాంటి సంఘటనేమీ జరగలేదని, ఆ వార్తల్లో నిజం లేదని అనుపమ పరమేశ్వరన్ తల్లి సునీత స్పష్టం చేశారు.