గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (12:49 IST)

జూనియర్ ఎన్టీఆర్‌కు తల్లిగా ప్రియమణి..?

priyamani
టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారబోతోంది. ఒకప్పుడు ఆ హీరోతో జతకట్టిన సదరు హీరోయిన్ ప్రస్తుతం ఆ హీరోకు మదర్‌గా నటించనుందనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ప్రియమణి.. జూనియర్ ఎన్టీఆర్‌తో యమదొంగ సినిమాలో కలిసి నటించింది. తాజాగా అదే ఎన్టీఆర్‌కు తల్లి పాత్రలో కనిపించబోతోందని వార్తలు వస్తున్నాయి. 
 
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా దేవరలో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని.. ఇందులో ఏజ్డ్ ఎన్టీఆర్ పాత్రకు జోడీగా ప్రియమణి, కుమారుడి ఎన్టీఆర్‌కు తల్లిగా కనిపించనుందని టాక్. 
 
దీనిపై సినీ యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే షారూఖ్ జవాన్‌లో ప్రియమణి నటించి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే.