శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (23:33 IST)

చంద్రన్న అరెస్ట్.. నోరెత్తని దేవర.. కారణం ఏంటి?

devara action seans
దివంగత ఎన్టీ రామారావు మనవడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ వివాదానికి కారణమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ సందర్భంగా  నందమూరి-నారా కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కనీసం బయటకు కూడా రాలేదు. ఎన్టీఆర్ స్వార్థపరుడని, ఆయన కుటుంబం పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుగుదేశం ప్రముఖ నాయకులు ఆరోపించారు. 
 
ఎన్టీఆర్ మాత్రం ఇవన్నీ వింటూ సైలెంట్‌గా ఉన్నాడు. ఈ వాదనలపై ఆయన స్పందించలేదు.
 
 అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై పూర్తి దృష్టి కేటాయించారని.. రాజకీయ విషయాలలో పాల్గొనడానికి ఇష్టపడట్లేదని తెలుస్తోంది. "దేవర" షూటింగ్ షెడ్యూల్ సోమవారం (సెప్టెంబర్ 11) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షూటింగ్ నెలపాటు హైదరాబాదులో కొనసాగనుంది.