సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:38 IST)

పెళ్లికాకుండానే గర్భందాల్చిన యువతి.. నిప్పంటించిన తల్లి - సోదరుడు

Woman Fire
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. 21 యేళ్ల ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. తమ పరువు పోయిందని భావించిన తల్లి, సోదరుడు ఆగ్రహంతో ఊగిపోయారు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని నిలదీశారు. ఆ తర్వాత ఆ యువతిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పంటించి చంపేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలో హాపూర్‌కు చెందిన ఓ యువతి వివాహం కాకుండానే గర్భందాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి, సోదరుడు ఆగ్రహంతో ఊగిపోయారు. బిడ్డకు తండ్రి ఎవరని నిలదీసినా ఆ యువతి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆ యువతిని ఊరికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నిప్పంటించారు. 
 
ఈ ఘటనను కొందరు రైతులు గమనించి, ఆ యువతిని రక్షించే క్రమంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మీరట్‌ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి తల్లి, సోదరుడిని అరెస్టు చేశారు.