గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (10:57 IST)

బ్రెజిల్‌లో కూలిన విమానం... 14 మంది మృత్యువాత

plane
బ్రెజిల్ దేశంలోని అమెజోనాస్ రాష్ట్రంలో గల బార్సెలోస్ పర్యాటక ప్రాంతంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 12 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా మరణించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
 
అలాగే, ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లీమా కూడా తన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ ప్రమాద వార్తను వెల్లడించారు. అమెజోనాస్ రాష్ట్రం రాజధాని మానాస్‌ నుంచి కొందరు ప్రయాణికులతో ప్రముఖ పర్యాటక ప్రాంతంలో బార్సెలోస్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ విమానం కూలిపోయిందని గవర్నర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వీరంతా చనిపోయారు. కాగా, మొత్తం 18 మంది ప్రయాణికులను తరలించగలిగే ఈ ట్విట్ ఇంజిన్ విమానం బ్రెజిల్ దేశానికి చెందిన ఎంబ్రేయర్ తయారు చేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.