బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (12:51 IST)

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్.. అంధుడి పాత్రలో నటించేందుకు సంసిద్ధత

'జనతా గ్యారేజ్' సినిమా హిట్‌తో యంగ్ టైగర్ మాంచి ఊపుమీదున్నాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టింది. ఈ స్థాయి వసూళ్లు రావడం ఎన్టీఆర్ కెరీర్లో ఇదే మొదటిసారి. ఈ సినిమా అనంతరం మరో సినిమాను పట్

'జనతా గ్యారేజ్' సినిమా హిట్‌తో యంగ్ టైగర్ మాంచి ఊపుమీదున్నాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టింది. ఈ స్థాయి వసూళ్లు రావడం ఎన్టీఆర్ కెరీర్లో ఇదే మొదటిసారి. ఈ సినిమా అనంతరం మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు జూనియర్ ఎన్టీ‌ఆర్. 
 
ఈపరిస్థితుల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'పటాస్‌', 'సుప్రీం' చిత్రాల్ని తెరకెక్కించి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. 
 
కాగా హీరో రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రుపొందాల్సి ఉన్న నేపథ్యంలో రామ్ పారితోషికం విషయంలో ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో అదే కథని ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక అనిల్ స్క్రిప్ట్‌లో హీరో కొంత సమయం గుడ్డివాడిగా నటిస్తాడు. 
 
ఇక ఎన్టీఆర్ సైతం గుడ్డివాడిగా కనిపించేందుకు అంగీకరించాడని సినీవర్గాలు అంటున్నాయి. మాస్ హీరో ఎన్టీఆర్ గుడ్డివాడి పాత్రలో దుమ్మురేపడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ తీసుకున్నఈ నిర్ణయం అభిమానులకి సినీ వర్గాల వారికి షాకింగ్‌గా మారింది.