మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2017 (16:40 IST)

రాత్రి అయితే నా గదికి వచ్చి కౌగిలించుకోవాలని కోరేవాడు: బాలీవుడ్ నటి స్వర భాస్కర్

బాలీవుడ్ నటి.. వీరే దీ వెడ్డింగ్ హీరోయిన్ స్వర భాస్కర్ నోట వేధింపుల మాటలొచ్చాయి. ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని స్వర భాస్కర్ చెప్పింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. స్వర భాస్కర్ సినీ రంగంలో త

బాలీవుడ్ నటి.. వీరే దీ వెడ్డింగ్ హీరోయిన్ స్వర భాస్కర్ నోట వేధింపుల మాటలొచ్చాయి. ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని స్వర భాస్కర్ చెప్పింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. స్వర భాస్కర్ సినీ రంగంలో తాను ఎదుర్కొన్న సమస్యలపై నోరు విప్పింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టెయిన్, హీరోయిన్స్‌పై జరిపిన అకృత్యాలు, వేధింపుల వివరాలు వెలుగులోకి వస్తున్న వేళ.. ఇదే తరహా వేధింపులను ఎదుర్కొన్న భారతీయ హీరోయిన్లు కూడా బయటపడుతున్నారు. 
 
ఇదే తరహాలో స్వర భాస్కర్ సినిమా షూటింగ్ సెట్లలో జరిగిన వేధింపులను వెల్లడించింది. షూటింగ్ సెట్స్‌లో ఎలా కొందరు ఆదేశిస్తే మిగతావారంతా వాటిని పాటిస్తారో.. లైంగిక వేధింపుల విషయం కూడా అంతేని.. ఫలానా చోటికి వెళ్లాలంటే వెళ్లాల్సిందే. ఈ విషయంలో బాధితులు నోరు మెదపకుండా ఉంటారని.. ఈవ్ టీజింగ్ సర్వసాధారణమని తెలిపింది. తాను కెరీర్ తొలినాళ్లలో ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నానని చెప్పింది. 
 
ఈ సినిమాలో నటించేందుకు 56 రోజుల పాటు అవుట్ డోర్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సినిమా దర్శకుడు డిన్నర్‌కు రావాలని తనను వేధించాడు. రోజంతా సరిగ్గా నటించలేదని తిడుతూ.. రాత్రి అయ్యేసరికి సీన్ గురించి మాట్లాడాలని మద్యం తాగి వచ్చేవాడని.. షూటింగ్ మొదలైన వారం రోజుల వ్యవధిలోనే ప్రేమ, సెక్స్ గురించి మాట్లాడేవాడని చెప్పుకొచ్చింది. 
 
రాత్రి అయితే తన గదికి వచ్చి కౌగిలించుకోవాలని కోరేవాడని.. చాలా భయపడి.. ఒంటరిగా గదిలో లైట్లన్నీ ఆర్పేసి.. చీకట్లోనే మేకప్ తీసేస్తూ వుండేదాన్నని తెలిపింది. గదిలో లైట్లు లేకుంటే, నిద్రపోతున్నానేమోనని అతను రాకుండా ఉంటాడని అనుకునేదాన్ని. ఆ తర్వాత అతనికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌కు విషయం చెప్పగా, తనకు ఎస్కార్ట్ కల్పించారని దాంతో ఆ బాధ తగ్గిందని తెలిపింది. వేధింపులు ఎదురైతే ఎదుర్కోవాలని.. వారికి ఎట్టి పరిస్థితుల్లో లొంగకూడదని స్వర భాస్కర్ సహ హీరోయిన్లకు, మహిళలకు సలహా ఇస్తోంది.