శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (12:55 IST)

తమన్నా నువ్వు నేచురల్ బ్యూటీ.. నీకెవ్వరూ లేరు సాటి

హీరోయిన్లు అంటేనే అందం అభినయం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న హీరోయిన్లు అంటే విపరీతమైన మేకప్, హాట్ హాట్ లుక్స్. సినిమాలో మాత్రమే కాకుండా ఎక్కడ కనిపించినా.. కళ్లు చెదిరే మేకప్‌తోనే దర్శనమిస్తారు. ఆహారం లే

హీరోయిన్లు అంటేనే అందం అభినయం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న హీరోయిన్లు అంటే విపరీతమైన మేకప్, హాట్ హాట్ లుక్స్. సినిమాలో మాత్రమే కాకుండా ఎక్కడ కనిపించినా.. కళ్లు చెదిరే మేకప్‌తోనే దర్శనమిస్తారు. ఆహారం లేకుండా ఉంటారేమోగాని మేకప్ లేకుండా ఉండరు అన్నట్టుంటుందీ వాళ్ల వ్యవహారం.

కాని ఈ విషయంలో మిల్కీ బ్యూటీ తమన్నా తనదైన శైలిలో స్పందించింది. మేకప్‌తో వచ్చే అందం కన్నా సహజంగా వుండే అందమే బెస్ట్ అంటోంది. ఎప్పుడూ షూటింగ్స్‌, ఫిల్మ్ ఫంక్షన్లు, పార్టీలలో మేకప్‌తోనే వుండే తమన్నా.. కాస్త డిఫరెంటుగా ఆలోచించి మేకప్ లేకుండా ఫ్రెష్ లుక్‌తో వున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడా ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను వీక్షించిన కొందరు 'తమన్నా నువ్వు నేచురల్ బ్యూటీ.. నీకెవ్వరూ లేరు సాటి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.