శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (22:31 IST)

ఇమ్రాన్ హష్మీతో రొమాన్స్.. నాకు సోదరుడి లాంటివాడు.. తను శ్రీ

tanushree dutta
వివాదాస్పద ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే నటి తనుశ్రీ దత్తా. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. 'ఆషిక్ బనాయా ఆప్నే' సినిమాలో తనుశ్రీ, నటుడు ఇమ్రాన్ హష్మీ రొమాన్స్  సన్నివేశాలు వైరల్‌గా మారాయి. దీనిపై తనుశ్రీని రియాక్షన్ అడగగా, ఆమె సమాధానం చూసి అందరూ అవాక్కయ్యారు.
 
ఇమ్రాన్ హష్మీ తనకు సోదరుడి లాంటివాడని తనుశ్రీ పేర్కొంది. తాజాగా ఇంటర్వ్యూలో తనుశ్రీ మాట్లాడుతూ..ఇప్పటి వరకు చాలా మంది టాప్‌ నటీమణులు సినిమాల్లో రొమాన్స్ సీన్స్ పండించారు. అలాంటప్పుడు తన సీన్స్ గురించే ఎందుకు చర్చకు వస్తున్నాయో తెలియట్లేదని వెల్లడించింది. ఇది నటన అంతవరకే.. ఇందులో వ్యక్తిగతంగా ఏమీ లేదు. తనకు, ఇమ్రాన్‌కు మధ్య వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఇమ్రాన్ హష్మీతో బ్రదర్ కెమిస్ట్రీ ఉంది. నిజంగానే మాకు అలాంటి సంబంధం ఉందని చెప్పింది. 
 
అయితే తనుశ్రీ క్లారిటీ ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగట్లేదు. 'ఇలా చెప్పి అన్నదమ్ముల బంధాన్ని చెడగొట్టకండి', 'తమ్ముడితో ఇలాంటి సీన్లు ఎవరు చేస్తారు' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు నానా పటేకర్‌, రాఖీ సావంత్‌పై తనుశ్రీ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.