సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (15:08 IST)

కేజీఎఫ్‌ కంటే సలార్‌లో పది రెట్లు హై మూమెంట్స్: యష్

kgfheroyash
పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సలార్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచిన కేజీఎఫ్ కంటే పది రెట్లు ఎక్కువ హై మూమెంట్స్‌ను సలార్ కలిగి ఉంటుందని ధృవీకరించారు. 
 
అలాగే కేజీఎఫ్ 2 ప్రమోషన్స్‌లో యష్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. యష్ కేజీఎఫ్ కోసం మాట్లాడుతూ.. నీల్ సృష్టించిన దానిలో కేజీఎఫ్ చాలా చిన్న భాగం అని, అసలు విషయం వేరే ఉందని చెప్పాడు. దీంతో నీల్ కూడా అది నిజమేనని ధృవీకరించాడు. 
 
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-శృతి హాసన్ ప్రధాన పాత్రలలో ప్రశాంత్ నీల్ సలార్‌లో ఖచ్చితంగా చాలా పెద్ద అంశాలు ఉన్నాయని దీని అర్థం.
 
 ఈ ఏడాది భారీ అంచనాలున్న సినిమాల్లో సలార్ ఒకటి. సినిమా చుట్టూ క్రేజీ హైప్ ఉంది. యాక్షన్ డ్రామాలు సలార్, KGF సిరీస్‌లకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.