నాకవి అవసరం లేదని దర్శకుడి ముఖం మీదే చెప్పేసిన తాప్సి

తాప్సి. తెలుగు ప్రేక్షకులు బాగా తెలిసిన హీరోయిన్. ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయంకృషితోనే పైకొచ్చిన హీరోయిన్ ఈమె. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో తాప్సి నటించారు. అయితే గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీం

బుధవారం, 7 మార్చి 2018 (16:25 IST)
తాప్సి. తెలుగు ప్రేక్షకులు బాగా తెలిసిన హీరోయిన్. ఎవరి రికమెండేషన్ లేకుండా స్వయంకృషితోనే పైకొచ్చిన హీరోయిన్ ఈమె. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో తాప్సి నటించారు. అయితే గత కొన్ని నెలలుగా తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ లోకి వెళ్ళింది. బాలీవుడ్లో విజయాలతో ముందుకు దూసుకెళుతోంది. మొదటగా తాప్సి తెలుగు సినిమాల్లోనే నటించింది. చాలామంది యువ హీరోలతో కలిసి ఆడిపాడింది.
 
తాప్సి నటించిన సినిమాలు కొన్ని ఫెయిలైనా, మరికొన్ని బాగానే హిట్టయ్యాయి. కానీ అవకాశాలు మాత్రం తాప్సికి బాగానే తగ్గాయి. విజయం ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్ళాలన్నదే తాప్సి ఆలోచన. అందుకే బాలీవుడ్ వైపే ఎక్కువ దృష్టి సారిస్తోంది. గత కొన్నిరోజులకు ముందు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక దర్శకుడు మీకోసం ఒక కథను సిద్థం చేశాము.. హీరోయిన్‌కు ప్రాధాన్యమున్న సినిమా అని చెప్పారట. దర్శకులు చాలా హీనంగా మాట్లాడుతున్నారు. నేను రెమ్యునరేషన్ గురించి మాట్లాడినా, షూటింగ్‌కు కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఏది జరిగినా నాపైన అంతెత్తు లేచి పడుతున్నారు.
 
సినీ పరిశ్రమలో నీకంటూ ఒక పెద్ద గుర్తింపు లేదు. మీ వాళ్ళు ఎవరూ సినీపరిశ్రమలో లేరు. అలాంటిది పోనీ అని దయతలిచి నీకు సినిమా అవకాశాలు ఇచ్చామని తెలుగు సినీపరిశ్రమలో దర్శకులు కొంతమంది అంటున్నారు. ఆ మాటలు నాకు చాలా బాధను తెప్పిస్తున్నాయి. తమిళంలో కూడా పెద్దగా నాకు అవకాశాలు రాలేదు. అందుకే బాలీవుడ్‌ను ఎంచుకున్నాను. ఇక్కడే ఉంటాను. నాకు తెలుగు, తమిళ సినిమాలు అవసరం లేదని సదరు దర్శకుడి ముఖం మీదే చెప్పేసిందట తాప్సి. దీన్నిబట్టి తెలుగు, తమిళ భాషల్లో తాప్సి సినిమాల్లో ఇక నటించడం అనుమానమే అంటున్నారు సినీ విశ్లేషకులు.

అన్నీ చూడండి

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

Shatavari Tea, స్త్రీలకు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే శతావరి టీ, ఎలా తయారు చేయాలి?

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments