ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (17:54 IST)

తెలుగు బిగ్ బాస్ -2.. జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాత?.. 100 రోజులు?

''బిగ్ బాస్'' షోకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన బిగ్ బాస్ కల్చర్‌కు ఇక్కడా మంచి క్రేజ్ లభించింది. స్టార్ మాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ షో అందరినీ ఆక

''బిగ్ బాస్'' షోకు క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి పాకిన బిగ్ బాస్ కల్చర్‌కు ఇక్కడా మంచి క్రేజ్ లభించింది. స్టార్ మాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం 70 రోజుల పాటు కొనసాగింది. ఫలితంగా స్టార్ మా రేటింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ షో విన్నర్‌గా శివ బాలాజీ నిలిచారు. 
 
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 కోసం సదరు టీవీ యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది. బుల్లితెర ప్రేక్షకుల కోసం బిగ్ బాస్-2ను త్వరలోనే తెరకెక్కించే దిశగా నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2కి కూడా ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే బిగ్ బాస్-2 షోను వంద రోజుల పాటు కొనసాగించనున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.