గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (23:09 IST)

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీలో టాలీవుడ్ స్టార్, ఎవరా స్టార్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమాని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
 
 అది ఏంటంటే... త‌మిళ‌, మ‌ల‌యాళ సినీ పరిశ్రమల నుంచి ఒక్కో అగ్ర క‌థానాయ‌కుడు ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తార‌ని స‌మాచారం. తెలుగు నుంచి కూడా ఓ ప్ర‌ముఖ న‌టుడు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నార‌ని తెలిసింది.
 
పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. అన్ని భాష‌ల వారినీ ఆక‌ట్టుకోవాలి. అందుకే… వివిధ భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల‌కు ఈ సినిమాలో చోటు క‌ల్పించ‌బోతున్నారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు.
 
 కాగితాల మీదే 250 కోట్ల బడ్జెట్ ఉంటే.. ఇక సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఈ బడ్జెట్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెట్స్ పైకి వెళ్లకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో..?