మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (11:20 IST)

ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్.. ప్రభాస్‌ మూవీలో 'ది లెజెండ్'

ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె జంటగా ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించనుంది. "మహానటి" ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ భారీ వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు.
 
అయితే, శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వైజయంతీ మూవీస్, తన ట్విట్టర్ ఖాతాలో బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ఇచ్చింది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్, ఇండియా గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్, తమ చిత్రంలో నటించనున్నారని ప్రకటించింది. ఆయన చేరికతో, తమ ప్రయాణం మరింత విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోలో "ఒక లెజెండ్ లేకుండా లెజెండ్ మూవీని ఎలా నిర్మించగలం" అంటూ ట్వీట్ చేసింది.