ఆ ముగ్గురు హీరోయిన్లకు 'డ్రగ్స్ కేసు' నుంచి విముక్తి లభించినట్టేనా?
దేశంలో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో పలువురు హీరోయిన్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారించింది. వీరిలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, శ్రద్ధ కపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఈ ముగ్గురి వద్ద గంటల తరబడి విచారణ జరిపిన ఎన్సీపీ పలు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. అలాగే, వీరి ఫోన్లను కూడా సీజ్ చేసి విశ్లేషిస్తున్నారు.
అయితే, ఈ విచారణ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకుంది. అలాగే, మిగిలిన ముగ్గురు హీరోయిన్లు దీపికా పదుకొనె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్‌లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్‌లు మాత్రం ముంబైలోనే ఉన్నారు. వీరందరికీ ఎన్సీబీ దాదాపుగా క్లీన్‌చిట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని ఎన్సీబీ అెరెస్టు చేసింది. ఆమె వద్ద జరిపిన విచారణలో మరికొంది హీరోయిన్లకు సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో వీరందరికీ సమన్లు జారీ చేసి విచారణ జరిపారు.
అయితే, రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం రియా తెచ్చిన డ్రగ్స్‌ను తన ఇంట్లో దాచిపెట్టినట్టు అంగీకరించింది. రియా తన ఇంట్లో డ్రగ్స్ దాచిందని, తాను మాత్రం ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని రకుల్ చెప్పగా, దీనిపై ఎన్సీబీ అధికారులు మరింత దృష్టి పెట్టారు. మరోసారి రకుల్‌ని విచారించి కీలక ఆధారాలు రాబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అదేసమయంలో దీపికా, సారా, శ్రద్ధాలకు మాత్రం ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టేనని ముంబై వర్గాల సమాచారం.