సెక్స్ రాకెట్ నడిపిన కన్నడ హీరోయిన్లు? రాగిణి - సంజన్ ఫోన్లలో నీలి చిత్రాలు!
శాండిల్‌వుడ్‌లో సంచనలం రేపిన డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అనే ఇద్దరు హీరోయిన్లతో పాటు మరికొందరిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా, వీరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పరిశీలించగా, నీలి చిత్రాల వీడియోలు సైతం ఉన్నట్టు సీసీఎస్ పోలీసులు తేల్చారు. అంటే.. ఈ హీరోయిన్లు సెక్స్ రాకెట్ కూడా నడిపినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్నారు. పైగా వీరు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ స్మార్ట్ ఫోన్లను సీజ్ చేసిన అధికారులు, వాటిల్లో అత్యంత కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. ఈ ఫోన్లలో బ్లూ ఫిల్మ్‌లతో పాటు, నగ్న చిత్రాలు కూడా ఉన్నాయని సీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. వీటిల్లో మరికొందరు హీరోయిన్ల చిత్రాలు, వీడియోలు కనిపించడంతో దీంతో డ్రగ్స్ కేసు వెనుక మరో దందా కూడా నడుస్తోందని అధికారులు విశ్వసిస్తున్నారు.
ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా వీరు దందాను నడిపించారని, డ్రగ్స్ కేసు బయటకు రాగానే ఆ గ్రూప్‌ను వీరు డిలీట్ చేశారని చెబుతున్న సీసీబీ, ఈ విషయంలోనూ లోతుగా విచారించాల్సి వుందన్నారు. వీరు సెక్స్ రాకెట్ కూడా నడిపించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
దీంతో సంబంధముందని భావిస్తున్న అందరికీ నోటీసులు పంపి విచారించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. కాగా, ఈ కేసులో మరో ఇద్దరిని బెంగళూరులో సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కెంగేరికి చెందిన ఓ వ్యక్తిని, నైజీరియా వాసిని అరెస్ట్ చేసి మంగళూరుకు తరలించామని స్పష్టం చేశారు.
వీరిద్దరూ ముంబై, గోవా తదితర ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలను తీసుకుని వచ్చి మంగళూరులో అమ్ముతున్నట్లుతేలిందని, తమ అదుపులో ఉన్న డ్యాన్సర్ కిశోర్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు వీరిని అరెస్ట్ చేశామని అధికారులు వెల్లడించారు.
తమ కస్టడీలో ఉన్న సమయంలో రాగిణి, సంజనలు ఇచ్చిన సమాచారం అధారంగా గత మూడు రోజుల నుంచి పలువురిని విచారించామని, వీరికి సన్నిహితంగా ఉన్నవారిని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
అంతేకాకుండా, రాగిణి సన్నిహితులిద్దరిని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలో విచారించామని, వారు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు రూఢీగా తెలిసిందని అన్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల సస్పెండ్ అయిన ఓ ఏసీపీకి కూడా ప్రమేయం ఉన్నట్టు తెలిసిందని అన్నారు.