నోకియా నుంచి రెండు చౌక స్మార్ట్ ఫోన్లు.. నోకియా 8.3 5జీ కూడా..!
నోకియా నుంచి రెండు చౌక స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. నోకియా 2.4, నోకియా 3.4ల పేరిట ఈ ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు పోర్టబుల్ స్పీకర్లు, పవర్ ఇయర్ బడ్స్ వంటి పలు పరికరాలను కంపెనీ ప్రకటించింది.
అంతేకాదు, కంపెనీ అధికారికంగా నోకియా 8.3 5జీ ధరను కూడా వెల్లడించి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మార్చిలో ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
నోకియా 8.3 5జీని రెండు స్టోరేజ్ వేరియంట్లలో అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని 6జీబీ+ 64జీబీ స్టోరేజీ మోడల్ ధర 599 యూరోలు, ఇది సుమారు రూ. 51,431.
కాగా 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ ఇతర వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర 649 యూరో అంటే సుమారు 55,725 రూపాయలు. ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.