ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (13:33 IST)

మోటోరోలా నుంచి మోటో ఇ7 ప్లస్.. ధర రూ. రూ.9,499

Moto E7 Plus
మోటోరోలా కంపెనీ నుంచి మోటో ఇ7 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మోటో ఇ7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మిస్టీ బ్లూ, ట్విలైట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌ను రూ.9,499 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 30 నుంచి విక్రయించనున్నారు. 
 
ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌ను అమర్చారు. 4జీబీ వరకు ర్యామ్‌ను అందిస్తున్నారు. 64జీబీ స్టోరేజ్ ఉంది. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 2 మెగాపిక్సల్ డెప్త్ కెమెరాను ఏర్పాటు చేశారు. 
 
ముందువైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా.. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
 
మోటో ఇ7 ప్లస్ స్పెసిఫికేషన్లు…
* 64జీబీ స్టోరేజ్‌, ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10
* 48, 2 మెగాపిక్సల్ బ్యాక్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాలు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0