సుశాంత్‌తో డేటింగ్ - స్మోకింగ్ చేశా, కానీ ఆ పని చేయలేదు.. సారా  
                                       
                  
				  				   
				   
                  				  బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. బాహ్య ప్రపంచానికి ఎంతో బుద్ధిమంతుల్లా కనిపించే హీరోయిన్లు.. తెరవెనుక మాత్రం మత్తులో జోరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, హీరోయిన్లకు చెడు అలవాట్లు పుష్కలంగానే ఉన్నట్టు బహిర్గతమవుతోంది. ఈ విషయాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో సంబంధిత హీరోయిన్లే స్వయంగా చెప్పడం గమనార్హం. 
				  											
																													
									  
	 
	తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు హీరోయిన్లు ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో వారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ ఒకరు. తాను సుశాంత్‌తో కొంతకాలం ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని, థాయ్‌లాండ్‌కు పర్యటనలో ఆయనతో కలిసి వెళ్లానని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
				  
	 
	అయితే, తాను సుశాంత్‌తో కలిసి సిగరెట్స్ తాగేదాన్ని తప్పితే డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని చెప్పినట్టు ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని ఆమె చెప్పడం గమనార్హం. అయితే, అతనికి డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తాయో తనకు తెలియదని చెప్పుకొచ్చింది.