గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (15:34 IST)

ప్రభాస్ మూవీ కోసం అమితాబ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సంచలన చిత్రం కోసం సీనియర్ డైరెక్టర్స్ సింగీతం శ్రీనివాసరావు - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రంగంలోకి దిగడం విశేషం.
 
సింగీతం స్ర్కిప్ట్ పర్యవేక్షణ చేస్తుంటే... దర్శకేంద్రుడు దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే... ఇందులో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నారని ఇటీవల అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. అమితాబ్ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి రెమ్యూనరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారింది. అయితే... ఇటీవల డైరెక్టర్ నాగ అశ్విన్ అమితాబ్‌కి క‌థ, ఇందులో ఆయన పాత్ర గురించి స‌వివ‌రంగా వివ‌రిస్తూ... ఓ మెయిల్ పంపార‌ని తెలిసింది.
 
ఈ సినిమా కథ, ఇందులో ఆయన పాత్ర బాగా నచ్చడంతో అమితాబ్ ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించారు. ఇక రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో అమితాబ్ పాత్ర దాదాపు 25 నిమిషాలు ఉంటుంద‌ని టాక్‌. అందుకోసం 25 కోట్లు ఆఫ‌ర్ చేశార‌ని స‌మాచారం.
 
 ఈ సినిమాకి అమితాబ్ అవసరం. అందుచేత రెమ్యూనరేషన్ విషయంలో బేరాలు ఆడలేదని.. వెంటనే ఓకే చెప్పారని తెలిసింది.