ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (11:03 IST)

ఆ హీరో - డైరెక్టర్ - హీరోయిన్ అరెస్టు తప్పదంటున్న సిట్ వర్గాలు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసును తవ్వుతున్నకొద్దీ పలువురు సెలెబ్రిటీల పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసులో ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్‌ల అ

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసును తవ్వుతున్నకొద్దీ పలువురు సెలెబ్రిటీల పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసులో ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్‌ల అరెస్ట్ తప్పదని సిట్ వర్గాలు చెబుతున్నాయి. 
 
ఇప్పటివరకూ నోటీసులు అందుకున్న సినీ ప్రముఖుల్లో వీరు ముగ్గురి చుట్టూనే ఉచ్చు బిగిస్తోంది. మిగతా వారంతా కేవలం కస్టమర్లుగా మాత్రమే ఉన్నారని, వీరు మాత్రం ఎంతో మందికి తమ చేతుల మీదుగా డ్రగ్స్ సరఫరా చేశారని సిట్ వర్గాలు గుర్తించాయి.
 
డ్రగ్స్‌కు అలవాటుపడి కస్టమర్లుగా ఉన్న వారిని అరెస్ట్ చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేస్తున్న పోలీసులు, మరొకరికి మత్తుమందులు సరఫరా చేసిన వారిని మాత్రం వదిలేది లేదని చెబుతున్నాయి. కస్టమర్లుగా ఉన్న వారిని ప్రశ్నించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పించి, ఈ దందాకు, మత్తుమందుల వాడకానికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తామన్నారు. 
 
కానీ, డ్రగ్స్‌ను సరఫరా చేసిన ఆ ముగ్గురినీ మాత్రం అరెస్ట్ చేయక తప్పదని అంటున్నాయి. రెండు మూడు రోజుల్లో వీరి ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభిస్తాయని, ఆపైనే వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో నోటీసులు అందుకున్న వారిలో ఈ ముగ్గురూ ఎవరన్న విషయమై అందరిలో ఆందోళన నెలకొంది.