అవకాశాల కోసం అన్న అంటూ ఆ హీరో వెంటబడుతున్న హీరోయిన్..?

శనివారం, 6 అక్టోబరు 2018 (20:44 IST)
తెలుగు, తమిళ భాషల్లో త్రిష ఎన్నో సినిమాల్లో నటించారు. ఒకప్పుడు అగ్రహీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు త్రిష. కానీ రానురాను ఆమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. దాంతో పాటు నటించిన సినిమాలు ఫెయిలైవుతున్నాయి. దీంతో త్రిషకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో త్రిష ఇంటికే పరిమితమైపోయింది.

 
ప్రస్తుతం కొంతమంది కొత్త హీరోయిన్లకు అవకాశాలు ఎక్కువగా రావడంతో పాత హీరోయిన్లకు పూర్తిగా సినిమాల్లో అవకాశం తగ్గిపోయింది. దీంతో త్రిష ఎలాగైనా తిరిగి సినిమాల్లో నటించాలని, గతంలో ఉన్న అగ్రస్థానంలోకి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంది. అందుకే తనకు బాగా పరిచయం ఉన్న హీరో విక్రమ్ వెంట పడింది త్రిష. 
 
విక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి అగ్ర హీరోస్థాయికి ఎదిగారు. తమిళంలో విక్రమ్‌కు మంచి హిట్సే ఉన్నాయి. ఈ మధ్యలో విక్రమ్ సినిమాలు వరుసగా వస్తున్నాయి కూడా. దీంతో అతనైతే తనకు పూర్తిస్థాయిలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తారన్న నమ్మకంతో ఆయన వెంట పడ్డారట త్రిష. 
 
విక్రమ్‌ను అన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ.. ఒక్క ఛాన్స్ ఇప్పించండంటూ కోరుకుంటోందట. ఖచ్చితంగా తాను సహాయం చేస్తానని, అయితే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ముందుకు రావాలని త్రిషకు చెబుతున్నాడట విక్రమ్. మరి చూడాలి... విక్రమ్ రెకమెండేషన్‌తో అయినా త్రిషకు సినిమాల్లో మళ్ళీ అవకాశాలు వస్తాయో లేదో.

అన్నీ చూడండి

విద్యార్థినికి 60 మార్కులు వస్తే 5 మార్కులుగా చూపించిన లెక్చరర్, డిబార్ చేసిన అధికారులు

అమ్మా క్యాంటీన్లలో రుచికరమైన ఆహారం అందించండి.. సీఎం విజయ్ ఆదేశాలు

నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ - ఎన్టీఏ అధికారులకు సమన్లు

రోడ్లపై నమాజ్ చేస్తే ఊరుకోం : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

స్కార్పియో, పది లక్షలు, బంగారం, 16 ఉంగరాలు ఇచ్చినా సరిపోలేదు.. వివాహితను ఏం చేశారు?

అన్నీ చూడండి

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

తర్వాతి కథనం
Show comments