suvichar

తండ్రి కాబోతున్న అర్జున్ రెడ్డి?

Written By మోహన్
Updated: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:18 IST)
అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రతి చిత్రంలో వేరియేషన్ కలిగి ఉన్న పాత్రలు చేస్తూ యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంలో మరెవరూ నటించలేరు అన్న రీతిలో నటించాడు. గతేడాది మూడు విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
 
అందులో గీత గోవిందం వంద కోట్ల మార్క్ వసూళ్లు సాధించిన చిత్రంగా విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ద్విభాష చిత్రంగా వచ్చిన 'నోట' ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన టాక్సీవాలా చిత్రం కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్నే సాధించింది. 
 
తాజాగా విజయ్ దేవరకొండ భరత్‌ కమ్మ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఇసాబెల్లా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్‌లు విజయ్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రంలో విజయ్ ఎనిమిదళ్ల పిల్లాడికి తండ్రిగా కనిపించబోతున్నాడట. వయస్సుకు మించిన పాత్రను పోషిస్తున్నాడని వినికిడి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో చిత్రం తెరకెక్కుతోంది. గీత గోవిందంతో మ్యూజికల్ హిట్ ఇచ్చిన సంగీత దర్శకుడు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

అన్నీ చూడండి

హరిద్వార్ గంగాఘాట్‌లో టూపీస్‌తో మహిళ స్నానం.. వీడియోపై రచ్చ రచ్చ (video)

గోవా కోర్టులో లొంగిపోయిన తరుణ్ తేజ్‌పాల్..

మాజీమంత్రి ఆళ్ల నాని గుండెపోటుతో హఠన్మరణం

రైల్వే పట్టాలపై కూర్చుని ఏం మాటలు.. రైలు ఢీకొని.. భారత సంతతి యువతి, స్నేహితుడు మృతి

పల్నాడులో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

అన్నీ చూడండి

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments