ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 7 జులై 2017 (05:59 IST)

ఇంతయితే చేస్తా అన్న దీపిక.. పారిపోతున్న నిర్మాతలు.. ఎందుకూ?

దక్షిణ భారత చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై వేసిన తిరుగులేని స్టాంప్‌లలో దీపికా పడుకొనే ఒకరు. ఆమె అంగీకరించి సైన్ చేస్తే చాలు వందకోట్ల రాబడి తమ సినిమాకు గ్యారంటీ అంటూ వెంటబడే నిర్మాతలు కోకొల్లలు. సంవత్సరాలుగా నిర్మించుకుంటున్న కెరీర్ పీక్ స్టేజీలో ఉంటున్న

దక్షిణ భారత చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై వేసిన తిరుగులేని స్టాంప్‌లలో దీపికా పడుకొనే ఒకరు. ఆమె అంగీకరించి సైన్ చేస్తే చాలు వందకోట్ల రాబడి తమ సినిమాకు గ్యారంటీ అంటూ వెంటబడే నిర్మాతలు కోకొల్లలు.  సంవత్సరాలుగా నిర్మించుకుంటున్న కెరీర్ పీక్ స్టేజీలో ఉంటున్న దీపిక ఒక సినిమాతో తనకు కలుగుతున్న ఆర్థికపరమైన నష్టాన్ని మరొకరూపంలో తీర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. తన ఫేస్ వాల్యూను ఆమె ఏ స్థాయికి పెంచేసిందంటే ఆ కటౌట్ ఏ సినిమాలో అయినా నటించాలంటే మూడు రెట్లు అధిక మొత్తం చెల్లించాల్సిందే. 
 
దీంతో దీపికా పదుకొనెను హీరోయిన్‌గా తీసుకునేందుకు నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారట. ఎందుకంటే పారితోషికం 12 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తా! అని కండీషన్‌ పెడుతున్నారట. దీపిక ఇంత డిమాండ్‌ చేయడానికి కారణం సంజయ్‌ లీలా బన్సాలీ డైరెక్షన్‌లో చేస్తోన్న ‘పద్మావతి’ అని టాక్‌. ఈ సినిమా కోసం ఏకంగా 200కిపైగా డేట్స్‌ ఇచ్చారట. అందుకుగాను 12 కోట్లు పుచ్చుకున్నారని భోగట్టా. 
 
అయితే ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చినందున దీపికా కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందట. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే తదుపరి చేయనున్న సినిమాలకు కూడా 12 కోట్లు తీసుకోవాల్సిందేనని ఫిక్స్‌ అయ్యారట. కానీ, నిర్మాతలు మాత్రం దీపికాకు అంత ఇవ్వడానికి ఫిక్స్‌ అవ్వడంలేదని సమాచారం. దాంతో బ్యూటీ మునగచెట్టు దిగక తప్పదని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ఏమో పద్మావతి ఘన విజయం సాధిస్తే దీపికా ఇంకా ఎక్కువ డిమాండ్ చేసినా ఆశ్చర్య పడాల్సి ఉంటుందేమో.