గురువారం, 28 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (17:23 IST)

విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌తో దేశ‌భ‌క్తి ప్రేరేపించే చిత్రంగా 1770

1770 pster
1770 pster
ప్ర‌ముఖ బెంగాళీ ర‌చ‌యిత బంకించంద్ర ఛ‌ట‌ర్జీ ర‌చించిన న‌వ‌ల ఆనంద‌మ‌ఠ్ అనే న‌వ‌ల ర‌చించిన వందేమాత‌ర గీతాన్ని మ‌న జాతీయ గేయంగా మ‌నం స్వీక‌రించాం. ఆ పాట రాసి 150 వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా దానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌ను నిర్మాత‌లు శైలేంద్ర కుమార్, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూర‌జ్ శ‌ర్మ విడుద‌ల చేశారు.
 
భార‌తదేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు అవుతున్నాయి. స్వ‌తంత్య్ర భార‌త‌ వ‌జ్రోత్స‌వాల‌ను దేశం యావ‌త్తు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు శైలేంద్ర కుమార్, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూర‌జ్ శ‌ర్మ వారి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ 1770ని అనౌన్స్ చేశారు. SS1 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, PK ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై బాహుబ‌భాషా చిత్రంగా  ఈ సినిమాను బ‌కించంద్ర ఛ‌ట‌ర్జీగారు రాసిన ఆనంద్ మ‌ఠ్ అనే న‌వ‌ల‌ను ఆధారంగా చేసుకుని రూపొందించ‌బోతున్నారు. పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ఈగ‌, బాహుబ‌లి వంటి భారీ చిత్రాల‌కు ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. 2021లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ‘ఆకాశ‌వాణి’ సినిమాతో అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. 
 
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అశ్విన్ గంగ‌రాజు మాట్లాడుతూ ‘‘ఇది నాకు పెద్ద ఛాలెంజింగ్ స‌బ్జెక్ట్‌. అయితే లెజెండ్రీ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించారు. ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మాత్ర‌మే నేను తెర‌కెక్కించాలి. అద్బుతమైన పీరియాడిక్ సెట్స్, అద్భుతమైన ఎమోష‌న్స్‌, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ త‌దిత‌ర ఎలిమెంట్స్ అన్నీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో ప‌క్కాగా స‌రిపోయాయి. ముందు కాస్త సందేహించాను. కానీ రామ్ క‌మ‌ల్‌గారితో మాట్లాడిన త‌ర్వాత ఆయ‌న విజ‌న్ తెల‌సుకున్నాను. నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమాను తెర‌కెక్కించ‌టానికి సిద్ధ‌మ‌య్యాను. అలాగే నిర్మాత‌లు  శైలేంద్ర కుమార్, సుజ‌య్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూర‌జ్ శ‌ర్మల‌ను రీసెంట్‌గా ముంబైలో క‌లిశాను. సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాల‌ని అంద‌రం సుదీర్ఘంగా చ‌ర్చించాం. వారు న‌న్ను రిసీవ్ చేసుకున్న తీరు.. వారి టీమ్ వ‌ర్క్ చూసి వెంట‌నే వారితో కనెక్ట్ అయ్యాను.
 
150 ఏళ్ల క్రితం బంకించంద్ర‌గారు రాసిన అనంద్ మ‌ఠ్ న‌వ‌ల‌లోని వందేమాత‌రం బ్రిటీష్ వారి పునాదుల‌నే క‌దిలించాయి. ఈ సంద‌ర్భంలో ఇండియాలో టాప్ స్టోరి టెల్ల‌ర్ వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు. ఆయ‌న మాట్లాడుతూ ‘‘వందేమాతరం అనేది ఓ మ్యాజికల్ పదం. మంత్రాన్ని బ‌కించంద్ర ఛ‌ట‌ర్జీ అనే మ‌హ‌ర్షి మ‌న‌కు అందించారు. ఇది జాతినంత‌టినీ ఏకం చేసి అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడేలా చేసింది. 1770లో భారత స్వాతంత్య్ర స‌మరం కోసం మ‌న‌లో స్ఫూర్తిని ర‌గిల్చిన యోధులెంద‌రో ఉన్నారు. వారి గురించి తెలియ‌జేసే చిత్ర‌మే 1770’’ అన్నారు.
 
రామ్ క‌మ‌ల్ మాట్లాడుతూ ‘‘నా విజన్‌పై న‌మ్మ‌కంతో ముందుకు వ‌చ్చిన నిర్మాత‌లు చాలా గొప్ప‌వారు. ద‌ర్శ‌కుడిగా అశ్విన్‌లో పాజిటివ్ వైబ్స్ నాకు న‌చ్చాయి. త‌న సొంత ఆలోచ‌న‌ల‌తో న‌న్ను వ‌చ్చి త‌ను క‌లిశాడు. త‌ను విజువ‌ల్‌గా స్టోరినంతంటినీ వివ‌రించాడు. ఆయ‌న మూవీ ఆకాశ‌వాణి చిత్రాన్ని నేను చూశాను. నాకెంత‌గానో న‌చ్చింది. స్టోరిని త‌ను వివ‌రించిన తీరు నాకెంత‌గానో న‌చ్చింది. 1770 చిత్రానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు అద్భుత‌మైన ర‌చ‌నను చేశారు. ఆయ‌న ఆలోచ‌న‌లు యూనిక్‌గా ఉన్నాయి. క‌చ్చితంగా ఈ సినిమాలో ఆయ‌న క‌థ‌, క‌థ‌నం స‌రిహ‌ద్దుల‌ను దాటి ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతుంద‌ని భావిస్తున్నాను. ఇలాంటి ఓ మంచి టీమ్ కుదిరటం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు.
 
లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను నిర్మించటానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని ఎస్‌.ఎస్‌. 1 ఎంట‌ర్‌టైన్మెంట్ శైలేంద్ర కె.కుమార్ తెలిపారు. పి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై సూర‌జ్ శ‌ర్మ‌.. జీ స్టూడియోస్ మాజీ హెడ్ సుజ‌య్ కుట్టి, నిర్మాత కృష్ణ‌కుమార్.బితో క‌లిసి సినిమా చేయ‌టం క‌ల నేర‌వేరిన‌ట్లుగా ఉంద‌ని తెలిపారు. ‘‘వందేమాత‌రం సినిమాను పాడుతూ పెరిగాం. అదే స‌మ‌యంలో రామ్ క‌మ‌ల్ న‌న్ను క‌లిసి ఆనంద్ మ‌ఠ్ క‌థ గురించి చెప్పారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్‌గారు ఆయ‌న స్టైల్ ఆఫ్ నెరేష‌న్‌ను అందించారు. దాన్ని విన‌గానే చాలా బాగా న‌చ్చేసింది. ఈ అసాధ్యమైన క‌ల‌ను సుసాధ్యం చేస్తోన్న నా మిత్రుల‌కు ధ‌న్య‌వాదాలు. ఇది సినిమా కాదు.. నా క‌ల నిజ‌మ‌వుతున్న రోజు. వెండితెర‌పై ఓ అద్భుత‌మైన చిత్రం ఆవిష్కృతం కానుంద‌ని’’ శైలేంద్ర తెలిపారు.  
 
పి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ అధినేత సూర‌జ్ శ‌ర్మ మాట్లాడుతూ ‘‘ఈ టీమ్‌లో నేను యంగ్ ప‌ర్స‌న్‌ని. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావ‌టం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అనుభ‌వజ్ఞులు, లెజెండ్స్ నుంచి చాలా కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటాను’’ అన్నారు.
 
జీ స్టూడియోస్‌పై హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని రూపొందించిన సుజోయ్ కుట్టి మాట్లాడుతూ ‘‘విజయేంద్రప్రసాద్‌గారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయ‌న చాలా మందికి ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌న ఈ సినిమాకు రైట‌ర్ కాకుండా ఉండుంటే ఈ సినిమాను నేను చేసేవాడిని కాను’’ అన్నారు.
 
కృష్ణ కుమార్‌.బి మాట్లాడుతూ ‘‘సుజోయ్‌గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆనంద్‌మ‌ఠ్‌ను సినిమాగా తెర‌కెక్కించాలంటే అద్భుత‌మైన వ్య‌క్తుల క‌ల‌యిక అవ‌సరం. చిన్న‌ప్ప‌టి నుంచి వందేమాత‌రం పాట‌ను పాడుతూనే పెరిగాం. ఇప్పుడు అదే మంత్రం ఎలా పుట్టింద‌నే దాన్ని ఆవిష్క‌రించ‌డానికి మేం ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లుగా నిల‌వ‌బోతున్నాం. నేను అశ్విన్ గంగరాజుతో స‌న్నిహితంగా ప‌ని చేశాను. రామ్‌గారు నాకు క‌థ‌ను నెరేట్ చేయ‌గానే అశ్విన్ నా మ‌దిలో మెదిలాడు’’ అన్నారు.
 
1770 చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాళీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా ఎవ‌రు న‌టిస్తార‌నే విష‌యాన్ని టీమ్ ద‌స‌రా ముందుగానే నిర్ణ‌యిస్తుంది. దీపావళి నాటికంతా మొత్తం న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను అనౌన్స్ చేస్తారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు అశ్విన్ త‌న టీమ్‌తో క‌లిసి ఈ పీరియాడిక్ సినిమాను యూనిక్‌గా రూపొందించ‌డానికి సంబంధించిన రీసెర్చ్ చేస్తున్నారు.